మిరు మేదట మి మేబైల్ సేట్టంగ్ లొకి వేలాలి తారువాత సేక్యరిటి లోకివేలాలి అక్కడ Unkow Sourse అనే దానిమిదా నొక్కలి అప్పడు అది(ON)అన్ అవుతుంది అప్పడు యప్ ఇన్ స్టల్ అవుతుంది Unkown Sourse అప్( OF)లోోవుంటే అన్ (ON)చేయండి 100% ఇన్ స్టల్ (install)అవుతుంది (Ok)
Home » Uncategories » సింగర్ సునీత ఘనంగా వివాహ వేడుక Singger Sunitha Marege pics
Sunday, 10 January 2021
సింగర్ సునీత ఘనంగా వివాహ వేడుక Singger Sunitha Marege pics
సాక్షి, హైదరాబాద్:వ్యాపారవేత్త రామ్ వీరపనేని, టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీతల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
కాగా.. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వయస్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భర్తతో విభేదాల నేపథ్యంలో డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సునీత మెహందీ ఫోటోలను, ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో మొహానికి పసుపు రాసుకొని కనిపించారు. తన కుమారుడు ఆకాష్, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి:(సింగర్ సునీత మెహందీ ఫంక్షన్)
0 Response to " సింగర్ సునీత ఘనంగా వివాహ వేడుక Singger Sunitha Marege pics"
Post a Comment