వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి సరికొత్త లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. వెంకటేశ్, ప్రియమణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు.ఈ చిత్రంతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ సినిమా వేసవి కానుకగా అభిమానులను అలరించనుందని తెలిపారు.
0 Response to " ‘నారప్ప’ కొత్త పోస్టర్ : సరికొత్త లుక్‌లో వెంకీ, ప్రియమణి venky Narappa Movie Updates 2021"
Post a Comment